Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద తెగిపోయిన నాగార్జునసాగర్ ఎడమ కాలువను మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలకు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ, వివేకానంద పరిశీలించారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు.
Read also: Terrible incident: మేడ్చల్‌లో దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..
సీఎం రేవంత్ తన తప్పు కప్పు పుచ్చుకునే క్రమంలో మాపై నిందలు మోపడం విడ్డూరం అన్నారు. సాగర్ ఎడమ కాల్వ గండి పాపం ఖమ్మం జిల్లా మంత్రులదే అన్నారు. సహాయక చర్యల్లోనూ పాలకులు పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఖమ్మం ప్రజల నుంచి తిరుగు బాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ సృష్టించిన ప్రకృతి విలయం అన్నారు. అంతా అయిపోయాక కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. ఎస్కేప్ ఛానల్ కు వెల్డింగ్ చేయడం వల్లే నష్టం జరిగిందన్నారు. తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగిందన్నారు.
Deputy CM Bhatti Vikramarka: మున్నేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం