Rescue Operation in Vijayawada: బెజవాడ నగరంలో వచ్చిన వరదలో 2 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. జి. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెళ్ళటూరు బ్రిక్స్ ఇండస్ట్రీ ఏరియాలో చిక్కుకున్న 48 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీ, షాబాధ గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలలోని సుమారు 30 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, నందిగామ రూరల్, పరిటాల న్యూ బ్రిక్స్ ఏరియాలోని మరో 60 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది తరలించారు.
Read Also: Chandrababu On Rains: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది.. సహయక చర్యలు కొనసాగుతున్నాయి..
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కొనసాగుతుంది. 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్ లోకి వెళ్లకపోవడంతో యూనిట్లన్నీ ట్రిప్ అయ్యాయి. దీంతో 2,560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్ లోకి వెళ్లకపోవడంతో 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. విద్యుత్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి ఎన్టీపీఎస్ అధికారులు, సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు.