వాతావరణం అన్నాక మార్పులు సహజం. కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్‌గా అసాధారణ వాతావరణం అందర్నీ వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. ఏం వచ్చినా పట్టలేం అన్నట్టుగా ఉంది వాతావరణం పోకడ. ఈ మధ్య కాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి. ఎంత సాంకేతికత ఉన్నా.. వాతావరణాన్ని అంచనా వేయడం వీలుకావడం…
కృష్ణా జిల్లా బుడమేరులో ఓ కారు కొట్టుకుపోయింది.. కేసరపల్లి ఉప్పులూరు రహదారిలో బుడమేరు కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది.. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి.. కారుతో సహా కొట్టుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు..
AP Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం చాలా తేలిక.. కానీ, మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే అయింది.. బుడమేరు 90 శాతం ఆక్రమణలలో ఉంది అన్నారు. అదే శాపంగా మారి బెజవాడను వరద నీటితో నింపింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భాతర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ.. అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది.
Budameru: కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడు ఇంతటి ఉదృతంగా ప్రవహించలేదంటున్నారు అక్కడి ముంపు ప్రాంతాల ప్రజలు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా చోచ్చుకు వచ్చాయి వరద నీరు. దాంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ…
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
12 People Killed: బెజవాడ నగరం మూడు రోజులుగా వరద ముంపులో ఉంది. వరద తగ్గినా కాలనీల నుంచి ఇంకా బయటకు వెళ్ళని నీరు.. 8 అడుగుల నుంచి 3 అడుగులకు బుడమేరు వరద ఉదృతి చేరింది. ఇళ్లలో చిక్కుకున్న వారు రాత్రి నుంచే ఇళ్ళ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి ఏర్పాడింది. అయితే, వరదల్లో గత 2 రోజుల్లో 12 మృతదేహాలను ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు గుర్తించారు.
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు..