గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి.. Read Also:…
విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.…