ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గోదావరి నదికి భారీ ఎత్తున వరదలు వచ్చిన సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దగ్గర ఉన్న అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ప్రతి ఏడాది జరుగుతుంది.
హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి.
వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలలో పడవలు, పంట్లు లో ప్రయాణించడం సహజం.. కానీ కాలాలు మారిన అక్కడి వారి కష్టాలు తీరడం లేదు.. దశాబ్దాలు తరబడి వంతెనల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.. అన్నీ పనులు ఆమోదం లభించింది అనుకునే లోపు ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి… తమ జీవితాలు జీవన ప్రమాణాలు మారవు అని వారికి అర్థం అయిపోయినట్లు ఉంది.. ఈ కష్టాలు తప్పవని డిసైడ్ అయిపోతున్నారు.. బడి పిల్లలు అయితే బిక్కుబిక్కుమంటూ చదువుకోవడానికి వెళ్లాల్సి…
మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం వద్ద వరద నీరు స్వల్పంగా తగ్గింది. 10 రోజులుగా వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే వుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 64 రోజులు ఆలయం మూతపడింది.