గోదావరి ఉప్పొంగడంతో గ్రామాల్లోని హ్యాండ్ పంపుల నుంచి ఉబికి ఉబికి వస్తోంది నీరు. చేతితో కొడితేనే సాధారణంగా నీరు వస్తుంది కానీ. ఇప్పుడు వర్షాలు, వరదల కారణంగా హ్యాండ్ పంపుల నుంచి ఏకధాటిగా నీరు వస్తోంది. గోదావరికి సమీపాన వున్న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
గత కొద్ది రోజులు భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానలతో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు జిల్లాల్లో వాగులు వంగలు నిండి పరుగులు పెడుతున్నాయి. ఈనేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సుమాచన్‌పల్లి- కోడూరు మధ్య వరదలు ముంచెత్తడంతో రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌బ్రిడ్జిలో భారీగా నీళ్లు పారుతున్నాయి. అదిగమనించకుండా డ్రైవర్ అలాగే బస్సును ముందుకు…
ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు. నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు.…
భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం,…
పెళ్ళంటే సందడే వేరు. పెళ్ళికి సర్వం సిద్ధం అయింది. కానీ భారీ వర్షం పెళ్ళింట్లో విషాదం నెలకొంది. కడప జిల్లా రాజంపేటలో వర్షం బీభత్సం కలిగించింది. ఈ వరద పెళ్ళి ఇంట్లో విషాదం నింపింది. పెళ్ళి ఆగిపోయింది. రాజంపేట రామచంద్రాపురంలో చెయ్యేరు వరద నీటిలో కొట్టుకుపోయింది 75 ఏళ్ళ సావిత్రమ్మ. దీంతో మనవడి పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోయింది. రాజంపేటలో ఇవాళ అమరనాథ్ అనే యువకుని పెళ్ళి జరగాల్సి వుంది. వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 30…
గత ఐదు రోజులుగా ఎగువ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుకుంటుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ద్వారా మూడో సీజన్ లో నీటి ఎత్తిపోతల ప్రారంభం అయింది. ఖరిఫ్ సీజ్ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు సిద్దమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ లోని 17 మోటర్లకు గాను…