శ్రీశైలం డ్యాంకి వరద ప్రవాహం బాగా పెరిగింది. ఎగువు నుంచి వస్తున్న వరదల కారణంగా ఈ ఏడాదిలో ఆరవ సారి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జునసాగర్ కు వరదనీటిని రేడియల్ క్రస్ట్ గెట్ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ఊరుకలేస్తుంది ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 3,60,802 క్యూసెక్కులు వస్తుండగా ఉండగా ఔట్ ఫ్లో 3,85,809 క్యూసెక్కులు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. ఇదిలా వుంటే కర్నూలు జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. కృష్ణానదికి వరద పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది.
70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పులి చింతల నుండి భారీగా వస్తోంది వరద. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇన్ ఫ్లో 2,34,231 క్యూ సెక్కులుగా వుండగా… మొత్తం 2,34,231 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా పెరిగింది వరద ప్రవాహం. ఇన్ ఫ్లో 1,23,115 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,21,185 క్యూసెక్కులుగా వుంది. 25 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కెసి కాలువకు 1,930 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. సుంకేసుల డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసిలు కాగా, ప్రస్తుత సామర్థ్యం 0.813 టిఎంసిలుగా వుంది.
Read Also: SCORPION POISON: లీటర్ తేలు విషం 80 కోట్లా! ఎందుకంత ఖరీదు?