రంగారెడ్డి జిల్లా జిల్లా రాజేంద్రనగర్‌లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే.. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. బ్యాంకులో, అవరణలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని…
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.…
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. కట్రా నుంచి జమ్మూకు వెల్లే బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనం కాగా… మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్ది సమయంలోనే…
గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసని తుఫాన్ వల్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో సబ్‌స్టేషన్‌లో మంటలు భారీగా చెలరేగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తాడికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పలు…
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలోని డ్రమ్స్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. ఇది గమనించి స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనల స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగనట్లు…
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో రథోత్సవం సందర్భంగా కరెంట్ షాక్ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. తంజావూరు సమీపంలోని కలిమేడు గ్రామంలో ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసుస్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల…
సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే గోదాం అగ్రిప్రమాదం జరుగగా.. మరల ఈ రోజు అదే గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. సికింద్రాబాద్ రాణి గంజ్ లోని ఫిలిప్స్ లైట్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.. విషయం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ లతో మంటలు అదుపులో కి తెచ్చారు..పై అంతస్తూ వరకు మంటలు వ్యాపించగా .. గోదాం లో ఉన్న సామగ్రి…
పంజాబ్లోని లుథియానాలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. లూథియానాలోని టిబ్బా రోడ్డులో మున్సిపల్ డంప్ యార్డుకు సమీపంలో గల గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు గుడిసెకు నిప్పు అంటుకున్న విషయంపై…
ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. థియేటర్లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే 25 ఏళ్ల కిందట ఇదే థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.…
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట. పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా…