యూపీలోని హాపూర్ జిల్లా ధౌలానాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మృతిచెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీలు కూడా దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మంత్రి మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం విచారణకు ఆదేశించారు.
ఇక.. గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్‌లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ టెక్స్‌టైల్ మిల్లులో నిన్న (శనివారం) రాత్రి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదు.
Harish Rao: ప్రైవేట్ మెడికల్ మందులు ఎందుకు..? మంత్రి సీరియస్..