హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్ని కీలకలు ఎగిసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…
తిరుమలలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉచిత బస్సులో (శ్రీవారి ధర్మరథం) మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులను బస్సులో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అయితే మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు. అనంతరం ఆ తర్వాత బస్సులోని శ్రీవారి సేవకులు వాహనం నుంచి…
11 మంది కార్మికులు సజీవదహనం అయిన బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ప్రమాద ఘటనను త్రీడీ స్కనర్‌తో పరిశీలించాయి క్లూస్ టీమ్స్.. 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి.. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు ఫైర్ సేఫ్టీ అధికారులు మరియు క్లూస్ టీమ్స్.. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా.. అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.. దీంతో స్క్రాప్ గోదాంలో మంటల…
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీరియస్ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ, హైదరాబాద్ పోలీస్, జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్ అధికారులతో సమావేశానికి సిద్ధం అయ్యారు హోమంత్రి మహమూద్ అలీ.. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి.. ఈ సమావేశంలో బోయిగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన ప్రమాదంపై విశ్లేషించనున్నారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి, వాటి అనుమతులపై కూడా రివ్యూ చేయనున్నారు.. మరోవైపు..…
హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు.. ఇవాళ తెల్లవారుజామను స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.. అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.. ఇద్దరు కార్మికులను ఫైర్ సిబ్బంది కాపాడారు.. ఇక, స్క్రాప్ గోదాం పక్కనే టింబర్ డిపోలు ఉన్నాయి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎనిమిది ఫైర్ ఇంజన్లు.. మంటలను అదుపుచేశాయి.. కానీ, అప్పటికే 11 మంది…
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని ఉడ్ కాంప్లెక్స్ శివారులో పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగగా.. ఆ మంటలు నెమ్మదిగా పక్కన ఉన్న బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా…
లాన్ పార్కింగ్ చేసుకున్న కార్లు అగ్నికి ఆహుతైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్కింగ్లో ఒక్కసారిగా ఓ కారులో మంటలు చెలరేగి నాలుగు కార్లుకు మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను అదుపు చేసే లోపే 4 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.…
కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల పొగతో ఆసుపత్రి ప్రాంతం కమ్ముకుపోయింది. ఈఘటనపై సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు,…
ఆదివారం మధ్యాహ్నం మాదాపూర్లోని టైర్ల మరమ్మతు దుకాణంలో మంటలు చెలరేగడంతో ఆస్తి దగ్ధమైంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత మోటారు విడిభాగాలు, టైర్లను ఉంచిన కారు మరమ్మతు దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. టైర్లకు సంబంధించి దుకాణం కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలోని మాదాపూర్ అగ్నిమాపక కేంద్రానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.…
ఏపీలో మరోసారి కలకలం రేగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇది గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పనా? లేదా ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానాలు…