ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో రోడ్డుపై నిలిపి ఉన్న బ్యాటరీ బైక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొదట పొగలు వచ్చి.. ఆ తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది.
Fire Accident: ప్రకాశం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం దద్దవాడ శివారులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగి లారీకి మొత్తం మంటలు వ్యాపించాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో అందులో ఉన్న 306 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. దీంతో భయంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దిగి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్కొక్కటిగా భారీ శబ్దాలతో సిలిండర్లు పేలడంతో సమీపంలోని…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్ నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్ తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భయంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. ఒక్క నిమిసం అక్కడ ఏంజరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే.. ఈఘటనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ముంబయి…
రష్యాలోని మాస్కోలో 15 అంతస్తుల భవనంలో రాత్రిపూట జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో ఫైర్ అలారం పనిచేయలేదని అధికారులు తెలిపారు. మాస్కోలోని ఆగ్నేయం దిశగా ఉన్న ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని.. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీలో కోరల్ బాగ్లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు…
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించగా హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించి మెప్పించాడు. నలుగురు స్టార్ హీరోల మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కమల్ నట విశ్వరూపం, ఫహద్, విజయ్ ల అద్భుత నటన ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. ఇక రోలెక్స్ పాత్రలో సూర్య…
యూపీలోని హాపూర్ జిల్లా ధౌలానాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మృతిచెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని…
నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్బవార్చి హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఐమాక్ ఛాంబర్లోని 2వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల ఎగిసిపడుతుండటంతో.. బిల్డింగ్ అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 14 మంది చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు క్రైన్ సహాయంతో వారిని సురక్షితంగా రక్షించారు. ఎన్టీవీ తో పైర్ ఆఫీసర్, మాదాపూర్ ఏసీపీ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఫోన్ కాల్…