రంగారెడ్డి జిల్లా జిల్లా రాజేంద్రనగర్‌లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే.. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అయితే.. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. బ్యాంకులో, అవరణలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే.. బ్యాంక్‌లో ఆస్తినష్టం వాటిల్లిందని, మంటలు అదుపు చేసాక.. పూర్తిస్థాయిల వివరాలు వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు.