విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించగా హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించి మెప్పించాడు. నలుగురు స్టార్ హీరోల మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కమల్ నట విశ్వరూపం, ఫహద్, విజయ్ ల అద్భుత నటన ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. ఇక రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన కొద్దిసేపు ఫ్యాన్స్ కు పూనకాలే.. సూర్య ఎంట్రీ సీన్ కు థియేటర్లో ఒక్కరు కూడా కూర్చొని లేరు అంటే అథాశయోక్తి కాదు. ఇక కొన్ని థియేటర్లో సూర్య ఎంట్రీ సీన్ కు థియేటర్లు చిరిగిపోతున్నాయి. తాజాగా సూర్య అభిమానులు అత్యుత్సాహం థియేటర్ యాజమాన్యానికి చిక్కులు తెచ్చిపెట్టింది. నిజం చెప్పాలంటే తెలుగు అభిమానుల కన్నా తమిళ్ అభిమానులు కొద్దిగా డేంజర్ అనే చెప్పాలి.
తమ అభిమాన హీరో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో సూర్య అభిమానులు విక్రమ్ సినిమాకు వెళ్లారు. సినిమా చూసినంత సేపు బాగానే ఉన్నారు. ఎప్పుడయితే సూర్య ఎంట్రీ సీన్ వచ్చిందో అప్పుడు రెచ్చిపోయారు. స్క్రీన్ వద్దకు వెళ్లి గోల గోల చేశారు.. ఇంకొంతమంది మరీ దారుణంగా క్రాకర్స్ వెలిగించి రచ్చ చేశారు. ఆ క్రాకర్స్ లో ఒకటి స్క్రీన్ కి తగలడంతో స్క్రీన్ కు మంటలు వ్యాపించాయి. స్క్రీన్ తగలబడటంతో పాటు ఫర్నీచర్ మరియు స్పీకర్ లు ఇంకా ఏసీకి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా తగులబడింది. దీంతో థియేటర్లో ఉన్న ప్రేక్షకులు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు క్రాకర్స్ తెచ్చిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Real திரை தீப்பிடித்த தருணம்#DinakaranNews| #Pondicherry | #Theatre | #Vikram | #Surya | #RolexSir | #Rolex pic.twitter.com/t1x3R16fIb
— Dinakaran (@DinakaranNews) June 8, 2022