శుక్రవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కుటుంబ బంధానికి మేలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ఆరోపించారు.
Jewellery Prices: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌లో.. విలువైన లోహాలతోపాటు బంగారం, వెండి, ప్లాటినం వస్తువులు మరియు ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. 2023-24 బడ్జెట్‌లో ఈ దిగుమతి పన్నును 22 శాతం నుంచి 25 శాతానికి చేర్చారు. దీంతో నగల రేట్లు పెరగనున్నాయి. ఈ నిర్ణయం.. గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలతోపాటు డిమాండ్ పైన కూడా ప్రభావం చూపనుంది.
ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు.
Today (01-02-23) Stock Market Roundup: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై రెండు విధాలుగా వ్యక్తమైంది. సెన్సెక్స్ లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్దఎత్తున అప్ అండ్ డౌన్స్‌కి గురయ్యాయి. ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
కేంద్రం బడ్జెట్‌లో రైల్వే శాఖకు పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రైల్వేశాఖకు నిధులు కేటాయించారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు.
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట లభించింది. వ్యక్తి పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు.