Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2023: కేంద్రం బడ్జెట్‌లో రైల్వే శాఖకు పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రైల్వేశాఖకు నిధులు కేటాయించారు. రైల్వేల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. కొత్త రైల్వేల నిర్మాణానికి పెద్దపీట పేస్తామని ప్రకటించారు. కేంద్ర సర్కారు దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఖర్చుపెట్టే మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూలధన వ్యయాన్ని ఏకంగా 33 శాతం పెంచుతూ నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టే మూలధన వ్యయం రూ.10లక్షల కోట్లకు పెరిగింది.
రైల్వేలో ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని పెంచాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైల్వేలో 100 ముఖ్యమైన పథకాలను గుర్తించినట్లు వెల్లడించారు. రైల్వేలపై అత్యధికంగా ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2013-2014 బడ్జెట్‌తో పోలిస్తే ఇప్పుడు కేటాయించిన మొత్తం తొమ్మిది రెట్లు ఎక్కువని తెలిపారు. నూతన కోచ్‌ల తయారీకి, వందేభారత్ రైళ్ల పెంపునకు పలు ప్రతిపాదనలు చేశారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రంగాల అభివృద్ధికి.., సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు వంద కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి వెల్లడించారు. వీటిపై ప్రాధాన్య క్రమంలో రూ.75వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.15వేల కోట్ల ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండనున్నట్లు చెప్పారు.
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక
రైళ్లలో ప్రజల ప్రయాణం మరింత పెరుగునున్నట్లు అంచనా వేసిన కేంద్రం.. మరో 1000కోచ్‌లను పునరుద్ధరించనున్నట్లు మంత్రి చెప్పారు. వీటిని రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు. ఈ కోచ్‌లను ప్రయాణికుల సౌకర్యంగా ఉండేటట్లు రూపొందించనున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!