Harish rao: అక్కడ మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish rao: ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 2790 కి పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలు అని, ఆనాడు మూడు ఏర్పాటు చేస్తే, మేము ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు మంత్రి. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా? అంటూ ప్రశ్నించారు. ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. నాటి మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి లేఖలు కూడా రాశారని తెలిపారు.
Read also: Formula E Racing: ‘ఫార్ములా-ఇ’ రేసు.. అలరించనున్న సాగరతీరం..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు ప్రారంబించారని స్పష్టం చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిస్థితి దారుణంగా ఉందని, ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించామన్నారు. అన్ని జిల్లాల్లో పారామెడికల్ కోర్సులు ప్రారంభిస్తున్నమని, మెడికల్, నర్సింగ్ తో పాటు పారామెడికల్ కాలేజీలు వస్తాయని శుభవార్త చెప్పారు హరీష్ రావు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడే ఎయిర్ సాంప్లార్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడుతున్నామన్నారు. 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ నెల రోజుల్లో పూర్తి చేసి, మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చేస్తామన్నారు. ఈ ఏడాదిలోనే మెదక్ కు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందని, ఫిల్మ్ నగర్ పి.హెచ్.సి కొత్త భవనం మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Pocharam Srinivas Reddy: అందుకే జన్మదిన వేడుకలు రద్దు చేశాను.. కంట తడి పెట్టిన పోచారం..
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!