Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట లభించింది. వ్యక్తి పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇన్‌కం ట్యాక్స్ పరిమితి రూ.ఐదు లక్షల నుంచి రూ.7లక్షలకు కేంద్రం పెంచింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పార్లమెంట్‌లో చెప్పారు. శ్లాబుల సంఖ్య 7 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త పన్ను విధానంలో రూ.3లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడిచారు. రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ఇకపై చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.