Nirmala Sitharaman: శుక్రవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కుటుంబ బంధానికి మేలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యావత్ దేశాన్ని దృష్టిలో ఉంచుకునే విధానాలను రూపొందిస్తున్నందున బీజేపీ జిజాజీలు, భతీజాల పార్టీ కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి స్పందించారు. శుక్రవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎవరినో దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్లు ప్రకటనలు ఇవ్వడం తప్పు అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో తాము నిధుల కేటాయింపులో ఏ ఒక్కరినీ కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకున్నామన్నారు.
TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్
కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ఎంపీలపై ఆమె ఘాటుగా స్పందించారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీరు మీ నోళ్లను డెటాల్‌తో శుభ్రం చేసుకోండి భయ్యా.. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు అంటూ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. హిమాచల్‌లో సర్కారును ఏర్పాటు చేసిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలపై వ్యాట్ పెంచేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ సంప్రదాయం ఇదేనని, ఆరోపణలు చేసి సభ నుంచి వాకౌట్ చేస్తారని.. అంతేగానీ ఎవరి మాట వినరంటూ నిర్మలా సీతారామన్ ఆరోపించారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా అశోక్ గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగంలో తప్పుల గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. రాజస్థాన్ కష్టాల్లో ఉందని.. తప్పులు ఎవరైనా చేస్తారు.. కానీ గతేడాది చదవాల్సిన ఎవరికీ రాకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు.