Telangana: ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర (సమితి) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ పథకానికి ఇంకా పేరు పెట్టలేదు. బహుశా "కార్మికబంధు" అనే పేరు పెట్టొచ్చని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతాారామన్ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గనున్నాయి. ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై రూ. 200 వరకు సబ్సిడీని ప్రకటించారు.…
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి చెప్పారు. పాస్ పోర్ట్ లన్నీ ఇకపై మైక్రో చిప్ ద్వారా వుండనున్నాయి. పౌరులకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇందులోనే వుంటుంది. ధ్వంసం చేయడానికి వీల్లేకుండా మైక్రో చిప్ లు తయారుచేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఈ-పాస్ పోర్ట్ లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. ఈ-పాస్ పోర్ట్ బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా…
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వచ్చారు.సీతారామన్ సంప్రదాయ బహీ ఖాతాకు బదులుగా ట్యాబ్‌ను ఉపయోగించి పార్లమెంటులో 2022 బడ్జెట్‌ను సమర్పించ నున్నారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3.45 గంటలకు విలేఖరుల సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.…
రోశయ్య మరణం రాష్ర్టానికి, రాష్ర్ట రాజకీయాలకు తీరని లోటని మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. రోశయ్యకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోశయ్య గౌరవ ప్రదమైన వ్యక్తి అని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, మంత్రిగా ఏపీకి ఎన్నో సేవలు అందించారన్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఆర్థిక వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.…
మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేసే వారిని సూటిగా అడుగుతున్నా.. రైతులపై, జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు పాదయాత్ర చేయాలి అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంతో రైతులపై భారం పడింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నది. 5 లక్షల భీమా ఇచ్చి రైతుకు భరోసా ఇచ్చింది దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే…
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవు. బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుంది అని తెలిపారు. బొట్టుబిల్లలు, గోడగడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర,…
బీజేపీకి ఓటు వేస్తే లాభం జరుగుతుందా.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా ఆలోచించాలి అని ప్రజల్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. పని చేసిన వాళ్ళు ఎవరూ.. చేయగలిగేవారు ఎవరు ఆలోచించాలి. కళ్యాణలక్ష్మీని కొంతమంది పరిగెరుకున్నట్లు అని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతోంది. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతోంది. వీణవంకలో ఓట్లు అడిగే ముందు…
హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది హరీష్ నీకు సవాలు చేస్తున్న.. అభివృద్ది జరగలేదు.. డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు అని తెలిపారు. కుంకుమ భరిణలు పంపించి…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవో అంగాన్ వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గతం లో వేతనాలు పెంచాలంటే ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తింటే జీతాలు పెరిగేది. తెలంగాణ ఫిరాష్ట్రం లో ఎటువంటి ధర్నాలు లేకుండా అంగన్వాడి లకు జీతాలు పెంచిది రాష్ట్ర ప్రభుత్వం. గత ఎడేళ్లలో…