Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 24 వరకు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ లో ఆమోదిస్తారు.
Also Read:Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్
ఈ నెల 17 లేదా 18న సభలో 2023-2024 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా సంక్షేమంతో పాటు విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నందున వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలకు మరిన్ని బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. విశాఖపట్నంలో జరగనున్న జి-20 కార్యవర్గ కమిటీ సమావేశం దృష్ట్యా ప్రభుత్వం మార్చి 28 లోపు బడ్జెట్ సెషన్‌ను ముగించే అవకాశం ఉంది.
Also Read:Instagram Cheating: బంపర్ ఆఫర్.. మూడు రోజుల్లో మూడు రెట్ల వడ్డీ
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ఈ సమావేశాల్లో సీఎం జగన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు.విశాఖ నుంచి పాలన ప్రారంభించడంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వంటి ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.
మరోవైపు ప్రజా సమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుపట్టాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, పోలవరం, రైతుల సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్.లోకేశ్ హాజరుకాకపోవచ్చని సమాచారం. MLC పదవీకాలం మార్చి 28న ముగియనుండడంతో బడ్జెట్ సెషన్ ఆయనకు చివరిది. 4,000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి హాజరు కాబోనని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!