ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు.
ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా ఏ సమాచారాన్ని కూడా వెబ్ సైట్ లో పెట్టటంలేదు. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో బిందు, తుంపర సేద్యానికి విశేష కృషి చేసింది. వైసీపీ ప్రభుత్వం ఉన్న పథకాలను తీసేయడం కాదు, రోల్ మోడల్ గా తయారవ్వాలి. టీడీపీ హయాంలో యాంత్రీకరణ ద్వారా రూ. 600 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ ప్రభుత్వం యాంత్రీకరణ కింద ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి..? దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను ఆపేసిన జగన్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు సోమిరెడ్డి.