ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి…
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు. రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, అగ్రికల్చర్‌పై రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే మొదటి సమావేశమని తెలిపారు. ఈ మీటింగ్‌లో వచ్చిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాను ముందుండి నడిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పాత కృష్ణా జిల్లాకు మంచి పేరు ఉందని.. ఇప్పుడు అదే రీతిలో ఎన్టీఆర్ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిళ రెచ్చిపోయారు. సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని.. చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుందని ఆగ్రహించారు. చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతున్నారని.. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా?అని నిలదీశారు వైఎస్ షర్మిల. కేంద్రం వడ్లు కొనకున్నా…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను ఈ నెల 16న రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు రైతు బ్యాంక్ అకౌంట్లో నేరుగా రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. ఈ ఏడాది మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.వీరిలో 47 లక్షల మంది భూ…
ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు.…
గ్రేటర్ వరంగల్ చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగతా రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్‌కి ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. వరంగల్ రింగ్‌రోడ్డు వెంట, 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు జీవోను కూడా విడుదల చేసింది. ఆఫీసర్లు…