Cm Jagan: ధాన్యం కొనుగోళ్ళపై జగన్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ధాన్యం కొనుగోళ్ళపై ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలిచ్చారరు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. ఖరీఫ్ నేపథ్యంలో ఇ– క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్ చేయాలి. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుందన్నారు.
ఇ–క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి. ఇ–క్రాప్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతో పాటు, ఫిజికల్ రశీదు కూడా ఇవ్వాలని గతంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. డిజిటల్ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలి. ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుంది. దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని బలోపేతం చేయాలి. వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌ల జాయింట్ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలి.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలన్నారు జగన్. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్ ఇ–క్రాప్‌లో లోడ్ చేయాలి. జూన్ 15 నుంచి ఇ– క్రాపింగ్ మొదలుపెట్టి, ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలి. సెప్టెంబరు మొదటి వారంలో సామాజిక తనిఖీ చేపట్టాలి. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్‌పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలి. మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్ జరుగుతున్న తీరును తనిఖీచేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్ళ మిల్లర్ల పాత్ర తీసేయాలన్నారు.
ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి. ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు. ధాన్యం కొనుగోలు బాధ్యత పౌరసరఫరాల శాఖదే అన్నారు సీఎం జగన్. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదే. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని వేరే వే–బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి. దీనివల్ల రైతుకు ఎంఎస్‌పీ లభిస్తుంది. రావాల్సిన ఎంఎస్‌పీలో ఒక్క రూపాయి కూడా రైతుకు తగ్గకూడదు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారి పక్షాన నిలవాలి. వారి వైపు నుంచే మనం ఆలోచించాలి. పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన నిలవాలన్నారు జగన్.
Gudivada tension: ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..గుడివాడలో టెన్షన్
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..