Breaking: ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం..! ఇవాళే రైతులకు భూములు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల పంపిణీకి రంగం సిద్ధం అయ్యిందా? రేపో మాపో ఆ భూములను సంబంధిత రైతులకు పంపిణీ చేస్తారా? అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది.. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులు ఉన్నారు.. అధికారులతో పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.. తూప్రాన్‌లో రాత్రంతా అధికారులు బిజీబిజీగా గడిపారు.. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్ హరీష్‌తో కలిసి తహసీల్దారు, కార్యాలయ అధికారుల పనిచేస్తున్నారని చెబుతున్నారు.. ఈ రోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. కబ్జా జరిగినట్టు తేల్చిన అధికారులు.. రైతుల భూముల్లో హద్దులు కూడా ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది..
Read Also: Live : నిన్ను కూడా ఇలాగే కత్తులతో… ప్రధాని మోడీకి వార్నింగ్..!
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
అయితే, ఇప్పటికే రెండు సార్లు ఆ భూముల్లో సర్వే నిర్వహించారు అధికారులు.. 56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు, గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు, అధికారుల్ని కలుస్తూ వస్తున్నారు అచ్చంపేట రైతులు.. ఈ నేపథ్యంలో.. రేపో మాపో ఆ రైతులకు భూములను పంపిణీ చేస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.. కాగా, భూ కబ్జా ఆరోపణలు వచ్చిన తర్వాత మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరారు.. ఇక, తన నియోజకవర్గం హుజురాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించి.. మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓవైపు బీజేపీ జాతీయ మహాసభలు హైదరాబాద్ వేదికగా సాగనున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ రాబోతున్నారు.. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఈటల భూ పంపిణీ వ్యవహారం కాకరేపుతోంది.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!