తెలుగు రాష్ట్రాల్లో ఏనుగులు, చిరుత పులులు, మొసళ్ళు, పాములు హల్ చల్ చేస్తున్నాయి. పల్నాడు జిల్లా ప్రాంతంలో చెరువుల్లో, పంట పొలాల్లో మొసళ్ళు సంచరిస్తున్నాయి. దీంతో రైతులు పంట పొలాల్లో పనులకు వెళ్ళాలంటే బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో మాచవరం,దేచవరం గ్రామ చెరువులలో మొసళ్ళు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు….చెరువు చుట్టు పక్కల మొసళ్ళు సంచరిస్తుండటంతో పొలం పనులకు వెళ్ళడానికి కూడా రైతులు వెనకడుగు వేస్తున్నారు. చెరువులో నుండి మొసళ్ళు పంట పొలాల్లోకి వస్తుండటంతో రైతులు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పొలాల్లో పనులు చేస్తున్నారు..
ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఈ మొసళ్ళ బెడద నుండి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు..ఈ మొసళ్ళు నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేత సమయములో సాగర్ రైట్ కెనాల్ ద్వారా ఈ చెరువుల్లోకి వచ్చి ఉంటాయని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. మొసళ్ళు తిరుగుతున్నాయని భావించేచోట జాగ్రత్తలు పాటించాలని అధికారులు రైతులు, గ్రామస్తులకు సూచిస్తున్నారు.
ఇటు చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లిలో అర్ధరాత్రి గజరాజు దాడులు హడలెత్తిస్తున్నాయి. గజరాజుల దాడిలో టమోటా.. చామంతి.. వరి పంటలు నష్టం వాటిల్లింది. తార్ల బండ వద్ద వేకువజామున 15ఏనుగుల గుంపు బయటకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకు ఎన్ని అడ్డుకట్టలు వేసిన గజరాజుల దాడులు మాత్రం ఆగలేదు. నష్టపోపోయిన రైతులకు నష్ట పరిహారం అందించిన పాపాన పోలేదు. గజరాజుల దాడిలో నష్టపోయిన రైతులను కార్యాలయాల చుట్టు తిరిగి కాళ్ళు అరిగాయే తప్ప……ప్రభుత్వ సాయం అందలేదని రైతులు మొరపెట్టుకుంటున్నారు.
Read Also: North Korea: కిమ్ కూతురు అంటే మామూలుగా ఉండదు.. యువరాణి తరహా సౌకర్యాలు
కడతట్లపల్లి గ్రామ చివారున ఉన్న బోడెనేగట్టు వద్ద ఉన్న రాజేష్ పంట పొలాల్లో 15 ఏనుగులు సంచరించి కొబ్బరి చెట్లు, ఒక ఎకరా వరి పంటను తొక్కిపడేశాయి. గజరాజుల దాడిలో ఒక ఎకరా వరి పంట నష్టపోయిందని రైతులు తెలిపారు. తార్ల బండ వద్ద వేకువజామున ఏనుగుల ఘీంకారావాలు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతన్నకు నష్ట పరిహారం అందించిన పాపాన లేదు….నష్టం వాటిల్లినప్పుడు సంఘటన స్థలంలో రైతన్నలకు సంబంధిత అధికారులు మాయ మాటలు చెప్పడం, చేతుల దులుపుకోవడం తప్ప మరొకటి లేదని అటవీ సరిహద్దు ప్రాంతాల రైతన్నలు వాపోతున్నారు. గజరాజుల దాడిలో నష్టపోయిన రైతన్నలు కార్యాలయాల చుట్టు తిరిగి కాళ్ళు అరిగాయే తప్ప ప్రభుత్వ సాయం అందలేదని ఆవేదన చెందుతున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల శివారున ఏనుగులు కనీసం నెలలో మూడు సార్లు దర్శనం ఇస్తున్న వాటి అడ్డుకునేందుకు అధికారులు ఏం చేయడంలేదు.
Read Also: Bhatti Vikramarka : ప్రస్తుత రాజకీయం అంతా నవ్వులాట లెక్క మారింది