Minister Harish Rao: కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతుకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి, అధిక ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్ ఫామ్ అని అన్నారు. పని తక్కువ ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అని మంత్రి తెలిపారు. అదనపు ఆదాయంకై ఆయిల్ ఫామ్ లో అంతరపంటలు వేయొచ్చని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు అధిక మేలు చేకూరుతుందని అన్నారు. అయితే.. ఈ మొక్కలు నాటడంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
Read also: UV Creations: అల్లు అరవింద్, దిల్ రాజు బాటలో యువీ…
ఇక, జిల్లా వ్యాప్తంగా 6300 ఎకరాల్లో ఈ మొక్కలు నాటామని, మొత్తం 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈనేపథ్యంలో వచ్చే రెండు మూడు నెలల్లో మరో 4 వేలు ఎకరాల్లో ప్లాంటేషన్ చేయనున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల పెంపకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, నెలలో రెండుసార్లు క్రాప్ వస్తుందని, ప్రతి నెల రూ.30 వేల చొప్పున ఏడాదికి రూ.3 లక్షల 60 వేలు ఆదాయం ఆర్జించొచ్చని పేర్కొన్నారు. అయితే.. ఏడాదిలో 24 సార్లు పంట చేతికొస్తుందని, దీనిని మంచి భవిష్యత్తు ఉన్న పంటగా చెప్పుకోవచ్చన్నారు. దీంతో.. రూ.లక్ష కోట్ల విలువైన ఆయిల్‌పామ్‌ను మన దేశం దిగుమతి చేసుకుంటున్నదని వెల్లడించారు. ఇక, నెలకు రూ.30 వేలు డబ్బు వచ్చే పంటగా అధిక దిగుబడి, అధిక ఆదాయం కలిగిన ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతగానో శ్రేయస్కరమన్నారు.
Praja Sangrama Yatra: 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర.. మామడ గ్రామంలో రాత్రి బస