ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే…
Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 1623 మండలాలను కరువుగా ప్రకటించారని ఎద్దేవా…
కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతుకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి, అధిక ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
రైతులకు, మిల్లర్లకు శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. మిల్లర్లు, రైతులు.. సీఎంను కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్నామని తెలిపారు.. రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ.. ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సీఎస్టీ…
Tomota Prices: ఏపీలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటాకు కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమోటాలను తెలంగాణలో మాత్రం పలు ప్రాంతాల్లో కిలోకు 15 నుంచి…
ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు.