PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు.
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తాజాగా హైకోర్టు అదే చెప్పిందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ట్వీట్టర్ ద్వారా ఆయన డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు.
KA Paul : కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
రాష్ట్రంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతును కూలీగా మార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. విప్లవాత్మకమైన రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల లబ్ధిదారుల సంఖ్యను పెంచుతుండగా, కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను తగ్గిస్తోంది.
Harish Rao: తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు సర్టిఫికెట్లు అందజేశారు. సంగారెడ్డి జిల్లా లో 86% ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఏఎన్ఎం,ఆశా వర్కర్లను అభినందించారు. దిగ్వాల్ లో ఈ ఇళ్లను చూస్తుంటే హైదరాబాద్ లో…