Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచిది.. ఇక, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. అయితే, మాస్టర్ ప్లాన్ మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని కోర్టుకు తెలిపారు జీపీ.. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. టౌన్ ప్లానింగ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయని.. మాస్టర్ ప్లాన్ పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అనేది ప్రభుత్వ నిర్ణయంగా పేర్కొన్నారు.. ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా ప్రశ్నించింది హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
కాగా, కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.. అయితే, కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని రైతులు ఆందోళనకు దిగారు.. వారి ఆందోళన, నిరసన కార్యక్రమాలకు విపక్షాలు కూడా గొంతు కలిపాయి.. ఇక, రాజీనామాలు, ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేయడంతో పాటు.. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి.. ముసాయిదాను రద్దు చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని కౌన్సిలర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.. మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని కౌన్సిల్ అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్లు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ ప్రకటించారు.. ఇక, కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. పూర్తి వివరాలను కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.