తెలంగాణలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు రైతన్నల్లు లబోదిబో మంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.
కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్‌లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు ఎగుమతి అవుతున్నాయి.
CM YS Jagan: గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందన్న ఆయన.. గతంలో వైఎస్సార్ పాలనలో కూడా సమృద్ధిగా వర్షాలు పడేవి.. రైతులు సుభిక్షంగా ఉన్నారు..…
Jagdeep Dhankhar: రానున్న రోజుల్లో శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్ ఎదుగుదలలో వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని ఆయన అన్నారు.