Master Plan: కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రైతు జే.ఏ.సి. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 20 లోపు మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని, ఉద్యమం ఉదృతం చేసేలా మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read also: Harassment: ఏంట్రా ఇది.. ఆరేళ్ల బాలుడిపై మైనర్ లైంగిక దాడి
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పండగ వాతావరణం చోటుచేసుకున్నా తరుణంలో ఇంటింటా బోగి మంటలు వేసుకుని ఆనందాన్ని గడుపుతున్నా కానీ.. భోగి రోజుకూడా కామారెడ్డి రైతన్నలు భగ్గు మన్నారు. ముగ్గులు వేసి వినూత్న నిరసనలు చేపట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ ముగ్గులతో మహిళలు నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ హఠా వో.. కామారెడ్డి బచావో వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి అంటూ నినాదాలు చేసి పండుగ రోజుకూడా నిరసలు చేపట్టారు. ఈ నెల 5న చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారడం అనివార్యమైంది. ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య తర్వాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాత్రమేనని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతో వారం రోజుల పాటు ఆందోళనలు వాయిదా పడ్డాయి. మరోవైపు రైతులు తమ నిరసనను ఇంకా కొనసాగిస్తున్నారు.
Read also: Mukkanuma Festival and Bommalanomu Special: ముక్కనుమ, బొమ్మలనోము సందర్భంగా ఈ స్తోత్రాలు వింటే చాలు
శనివారం భోగి రోజున ఆయన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి, అన్నదాత సుఖీభవ, మా భూముల్లో పరిశ్రమలు వేసి మీరేమో ఇండ్లలో పండుగ చేసుకోవడం ఇది మీకు న్యాయమేనా.? అంటూ ముగ్గుల రూపంలో రాసి తమ నిరసనను తెలిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు 49 మంది కౌన్సిలర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. అంతే కాకుండా మున్సిపల్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో వివాదం నడుస్తోన్న నేపథ్యంలో పండుగ రోజుకూడా ముగ్గురు వ్యక్తులు నిరసనకు దిగడం సంచలనంగా మారింది.
Tuesday Special Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి..