Revanth Reddy: సోమేష్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలి.. రేవంత్ ట్విట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తాజాగా హైకోర్టు అదే చెప్పిందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ట్వీట్టర్ ద్వారా ఆయన డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అని అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. అయితే.. ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి.. వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని అన్నారు. దీంతో.. ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేశ్ కు తాకిందని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ ప్రాంత ఐఏఎస్ లకు ఎప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ సూచించారు.
Read also: Cashews Benefits: ఇవి రోజూ తింటే.. పురుషుల్లో ఆ సమస్యలు దూరం
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ఏపీ క్యాడర్‌కు పంపాల్సిందేనని హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించిన విసయం తెలిసిందే.. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వాదనలు వినిపించారు. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేశారు. అయితే.. తెలంగాణ హైకోర్టులో సీఎస్ సోమేశ్ కుమార్ కు చుక్కెదురైంది. డీఓపీటీ పిటిషన్ పై హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ ఏపీకు వెళ్లిపోవాలని హై కోర్టు ఆదేశించింది. సోమేశ్ కుమార్ కౌన్సిల్ సమయం కోరింది. సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అప్పీల్ కు సమయం కోరింది. సమయం ఇచ్చేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు నిర్ణయంతో సోమేశ్ కుమారు ఏపీకి వెళతారా? లేక సుప్రీం కోర్టుకు ఆశ్రయిస్తారా? అనేది చర్చ జరుగుతుంది.
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నాం. తాజాగా హైకోర్టు అదే చెప్పింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలి. pic.twitter.com/6VtMSXUWUk
— Revanth Reddy (@revanth_anumula) January 10, 2023
N.V.S.S. Prabhakar: కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారు
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!