క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే…
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం వెల్లడించారు.
Kamareddy: బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్‌కు అంటిస్తారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన షాపుల వద్ద రైతులు పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు చేత పట్టుకొని విత్తనాల కోసం క్యూ కట్టారు. మండుతున్న ఎండలో విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. కొద్ది షాపుల్లో స్టాక్ ఉండటంతో.. రైతులు భారీగా బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా నిలబడితే కేవలం ప్యాకెట్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 659 అనే రకం…
ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన…