మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఏమీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు.. మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి? అని దుయ్యబట్టారు. రుణమాఫీకి ఇచ్చింది రూ.6098 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారు? అని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. మీ ఇష్టానుసారంగా తోచింది చేస్తాం అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు.. రెండో వంతు మందిని రుణమాఫీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. మీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి రైతుకూ రుణమాఫీ ఇవ్వాలని అన్నారు. లేదంటే బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని పేర్కొన్నారు.
IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
గత కేసీఆర్ హయంలో 37 లక్షల మంది రైతులు ఉంటే ఈరోజు 11 లక్షలకు ఎలా తగ్గారు? అని ఆయన ప్రశ్నించారు. 22 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేయకుండా ఎగగొట్టారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేస్తారా? చెయ్యరా అని ప్రశ్నించారు. పాస్ బుక్ ప్రామాణికం అని సీఎం చెప్పారు.. కానీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేయడం దారుణం అని అన్నారు. మరోవైపు.. రైతు భరోసాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. మీరు అసెంబ్లీలో మాట్లాడతాం అంటున్నారు.. అసలు మాట్లాడేది ఏముంది? అని పేర్కొన్నారు. బడ్జెట్ అలొకేషన్ చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఈ సీజన్ లో రైతు భరోసాను స్కిప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
రుణ మాఫీ వలే రైతు భరోసాలో మోసం చేసే అవకాశం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. రైతుల ఆర్థిక భారం కంటే.. మీ ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కంపెనీ వలె ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్.. ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక, యువత, నిరుద్యోగ వ్యతిరేక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. దోచుకోవడం కోసమే పాలన సాగిస్తున్నారని అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి స్కీమ్ లో స్కాం ఉంటుందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మన్ నిధి అనేది తాము ఎన్నికల హామీగా ఇవ్వలేదని.. ఆ రోజు ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రైతుల డేటా ఇవ్వలేదని తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వేస్తున్నామని చెప్పారు.