పొలాల్లో పంటలను కాల్చే రైతులకు ఈ ఏడాది నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కేంద్రం ఈ లేఖ రాసిన రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.
వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020- 21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.. మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని రైతన్నలను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు.
BRS Rythu Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతుదీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి బీఆర్ఎస్ రైతుదీక్షను ప్రారంభించనున్నారు.
KCR: పొలంబాటలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తు ముందుకు సాగుతున్నారు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే.
Bandi Sanjay:బీజేపీ ఎంపీ బండిసంజయ్ రైతు దీక్ష ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం…