CM Revanth Reddy: ఇవాల్టి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణాలు ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా రూ.6,098 కోట్లు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు ట్రయల్న్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న నున్నారు. మధ్నాహ్నం 2 గంటలకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (TGC)) సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు రైతునేస్తం. 500 రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్య్రమం ఉంటుంది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్షా 60వేల మంది రైతులు సహా మొత్తం 39 లక్షల కుటుంబాలు రుణమాఫీకి అర్హులు. రుణమాఫీకి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని, అయితే నెలాఖరులోగా రూ.1.5 లక్షలు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రుణమాఫీకి గడువు విధించిన ప్రభుత్వం.. ప్రక్రియ పూర్తికాగానే రైతుల వేదికల వద్ద సంబురాలు నిర్వహించాలని నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం రైతువేదికలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి వేడుకలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో రుణమాఫీ ప్రచారంలో పాల్గొంటారు.
Off The Record : వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?