రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని ఫైర్ అయ్యారు.
పాము పేరు వింటే చాలామంది భయపడతారు. కనిపిస్తే చంపడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషపూరిత పాముల వల్ల మనుషులకు హానికలిగే అవకాశం ఉంది. కానీ పాముల వల్ల మన పర్యావరణానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
రెండో విడత పంట రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.
మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఏమీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు.. మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి? అని దుయ్యబట్టారు. రుణమాఫీకి ఇచ్చింది రూ.6098 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారు? అని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు.
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగోతో ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవ్వగా.. తాజాగా ఆమె తల్లి మనోరమా ఖేద్కర్ యవ్వారం మరింత రచ్చ చేస్తోంది. తుపాకీ పట్టుకుని పొలంలో ఓ రైతును బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.