సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట మోసానికి పాల్పడుతున్నారు. ఏదో ఒక బ్యాంకు పిక్చర్ ను వాట్సాప్ ప్రొఫైల్ ఫిక్ గా పెట్టి ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచిస్తోంది. సైబర్ నేరగాళ్లు పంపించే లింకు యాక్సెప్ట్ చేస్తే..ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్ పే గూగుల్ పే యూ పే వాడకంలో జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. అలాంటి లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే 1930 ఫోన్ చేయాలని సూచించింది.
READ MORE: Viral video: బాబోయ్.. ఇవేం కుక్కలు.. బెంబేలెత్తిపోయిన డెలివరీ బాయ్
కాగా.. నేడు తెలంగాణ సర్కారు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ చేయనుంది. సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయి. 11.50 లక్షల మంది రైతుల రుణమాఫి సాయాన్ని పొందుతారు. ఇప్పటికే బ్యాంకులకు ఆర్థిక శాఖ నిధులు జమ చేసింది. ఆగస్టు పూర్తయ్యేలోపు 3 దశల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియ జరగనుంది. ఈ నెలఖారులోపు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ కానున్నాయి. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. కుటుంబాన్ని నిర్ధారించేందుకే ప్రామాణికంగా రేషన్ కార్డును చూడనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ మేరకు సూచనలు చేసింది.