Robert Vadra : రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆమెను టార్గెట్ చేశారు.
యూపీలోని హాపూర్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) యునైటెడ్ కిసాన్ మోర్చా నిరసన వ్యక్తం చేసింది. రైతులు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత, కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఢిల్లీ-లక్నో రహదారిని దిగ్బంధించి అక్కడే బైఠాయించారు. దిష్టిబొమ్మ విషయంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దిష్టిబొమ్మను లాక్కున్నారు. హాపూర్ నగర్‌లో రైతులు, పోలీసుల…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.
హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డ మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారని గుర్తు చేశారు.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది.
గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టింది.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పండించిన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.. రైతులను గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్
KTR Tweet: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలోనే ..
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.