ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన…
సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది.. కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డువడ్లు పండిస్తారు. అది తెలిసే సన్న వడ్ల కు 5 వందల బొనస్ అంటూ ప్రకటన చేశారు.
KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీకి విరుద్ధంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ఇది కపట కాంగ్రెస్ బ్రాండ్ మోసం, దగా, వంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP For Farmers: కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీజేపీ రణభేరీ మోగించింది. 6 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది.
Telangana Rains: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి.
రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు.. మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భములో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పథక అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు…
KCR Protest: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు.