గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన చీటింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు... ఇప్పటికే ఈ వ్యవహారంలో కోల్డ్ స్టోరేజ్ కు చెందిన నాగిరెడ్డి, రామచంద్ర రావు, వెంకటేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగి.. కోల్డ్ స్టోరేజ్ రికార్డులను పరిశీలించారు...
బియ్యం ఎగుమతులపై కేంద్రం శనివారం ఆంక్షలను సడలించడంతో తెలంగాణలోని వరి రైతులు ఆనందించడానికి కనీసం ఒక కారణం ఉంది. బాస్మతీయేతర తెల్ల బియ్యం విదేశీ రవాణాపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది , టన్నుకు కనీస ఎగుమతి ధర (MEP) $490 విధించింది. అదనంగా, అధికారులు తక్షణమే అమలులోకి వచ్చేలా విదేశీ విక్రయాలపై పన్నును 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం జూలై 20, 2023 నుండి అమలులోకి…
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న రైతు హామీల సాధన కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
నైజీరియాలోని జంఫారాలో నదిలో శనివారం జరిగిన పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది మరణించారు. రైతులను పొలాలకు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. బీజేపీ ప్రచారానికి పదును పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు కురుక్షేత్ర థీమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కనీవిని ఎరుగని రీతిలో బుడమేరుకు వచ్చిన వరద.. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలను అతలాకుతలం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 7రోజులుగా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు..
పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు దగ్గర అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. కర్షకుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వినేష్ ఫోగట్‌ను పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీ కుమార్తె.. మీకు అండగా ఉంటుందని ప్రకటించారు.
Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు.