KTR Tweet: రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
- వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది..
- వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలే..
- ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా-మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం..
- 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 లక్షల మందికి రుణమాఫీ అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని కేటీఆర్ అన్నారు. 100% రుణమాఫీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి డొల్లమాటలే అని మరోసారి తేలిపోయిందన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్న సన్నాసి మాటలు మోసం తప్ప మరొకటి కాదా అని ప్రశ్నించారు. రాబందు ప్రభుత్వం ఉంటే రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, రేవంత్ అసమర్థత ధాన్యం దాతలకు కోలుకోలేని శాపమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఒకవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని మాయమాటలు చెప్పి.. మరోవైపు 10 నెలల తర్వాత కూడా 20 లక్షల మందిని మోసం చేశారని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?? అని ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు.. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదన్నారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం అని ట్విటర్ వేదికగా సీఎం పై మండిపడ్డారు.
Also Read
20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది..
వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది..
ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా..
మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం..— KTR (@KTRBRS) October 4, 2024
Silver Fish Drink: ఈ డ్రింక్ ధర 5 వేల రూపాయలా? అంతగా ఏముంది అందులో..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!