Ponnam Prabhakar: రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారు.. ఆదాయం వచ్చే పంటలు వేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
తెలంగాణలో ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పచ్చి అబద్ధాలతో నడిపిస్తుండగా, ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ముంబైలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని, ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఎలా…
రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన ఈ రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి సేకరణ కోసం సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకరావొద్దని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోళ్ళకు 30 వేల కోట్ల అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొనుగోళ్లకై 20 వేల కోట్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ట్విట్టర్( X) వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తాన్ని మోసం చేశావని, మీ “గ్యారంటీలు” చక్కటి ముద్రణ , ఖాళీ వాగ్దానాలతో నిండి ఉన్నాయి. మీరిచ్చిన గ్యారంటీ కార్డు లో షరతులు వర్తిస్తాయని విషయం తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదన్నారు బండి సంజయ్.