కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.
దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్‌లో పడిపోయారు..
Tummala Nageswara Rao: అన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
KTR: వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్నివంచనతో మళ్లీ సర్కారు ముంచిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు ఇచ్చింది పరిహారం కాదు…పరిహాసమన్నారు కేటీఆర్. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అని., 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా…
రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
Telangana Rains: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ కీలక సమాచారం అందించింది. నేటి నుంచి రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ చొరవతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసిన బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్‌సింగ్ తెలిపారు.
Minister Sridhar Babu: రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయలేదు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వచ్చాయి.. త్వరలో మిగిలిపోయిన రైతుల ఖాతాల్లో రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు.
KTR Tweet: 20 లక్షల మందికి రుణమాఫీ అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.