Shivraj Singh Chouhan: రైతులకు గుడ్‌న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి
- రైతులకు గుడ్‌న్యూస్
- పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి చౌహాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ చొరవతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసిన బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్‌సింగ్ తెలిపారు. నూనె గింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్ట్రాల్లోని 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లలో రైతులకు ఉచితంగా బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని వ్యవసాయ మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేతల హతం?
Also Read
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
భోపాల్‌లో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. భారతదేశం అంతటా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులను ఆదుకోవడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ (ఎన్‌ఎంఈఓ-ఆయిల్‌సీడ్స్) కింద రైతులకు ఉచితంగా బ్రీడర్ విత్తనాలు, సర్టిఫైడ్ విత్తనాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన ఫౌండేషన్ విత్తనాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు.
నూనెగింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్ట్రాల్లోని 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు ఉచిత విత్తనాలను అందుకోవడమే కాకుండా దిగుబడిని పెంచడానికి అధునాతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇస్తామని చెప్పారు. రైతులు పండించిన ఉత్పత్తులను 100 శాతం కొనుగోలు చేసేలా చూస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Student suicide: ప్రిన్సిపల్ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం విషయంలో ఇటీవలి నిర్ణయాలు దేశీయ ఉత్పత్తి మరియు ధరలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయని చౌహాన్ తెలిపారు. సోయాబీన్, ఆవాలు, పొద్దుతిరుగుడు వంటి ఎడిబుల్ ఆయిల్‌లపై గతంలో 0% ఉన్న దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 27.5%కి పెంచినట్లు వివరించారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి రైతుల నుంచి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకి చట్ట బద్దత.. ఆర్డినెన్సుపై సంతకం చేసిన గవర్నర్
తాజావార్తలు
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!