Thummala Nageswara Rao: రూ. 2 లక్షల పైబడి రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు రుణమాఫీ ప్రక్రియ ఇంకా ప్రాసెస్ లో ఉందని అన్నారు. దసరా తర్వాత 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గాంధీ భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖా ముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పది నెలల కాలంలోనే 25వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గత ప్రభుత్వం అని మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వని రైతుబంధును కూడా ఇచ్చామన్నారు. స్వామి నాథన్ కమిషన్ నివేదిక కూడా ఎంఎస్పీ పెంపులో పట్టించుకోలేదు కేంద్రం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..
రుణమాఫీ ఇంకా ప్రాసెస్ లో ఉందని, దసరా తర్వాత 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళనలో లేరన్నారు. అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు అధికారం పోయిన వాళ్లకే ఆందోళన ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మీరు చేసిన రైతు వ్యతిరేక చర్యలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలవి బూటకపు మాటలని మండిపడ్డారు. రుణమాఫీలో టిఆర్ఎస్ వాళ్ళు ప్రపంచాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖా ముఖి కార్యక్రమంలో మంత్రికి అర్జీలు, తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరారు. ఇవాళ 95 అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్ ,ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై వినతి పత్రాలు వచ్చాయని మంత్రి తెలిపారు. కొన్ని సమస్యలపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నామన్నాఉ. గాంధీ భవన్ కి వస్తే తమ సమస్యలు తీరతాయని ప్రజలు వస్తున్నారని మంత్రి అన్నారు.
Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల ఫార్మేట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు