జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు.
బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
"ఉదయం ఆరింటికి లేచి చకచకా రెడీ అయ్యి.. స్కూల్ కి పరిగెత్తి.. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి రాగానే.. స్నాక్స్ తిని ట్యూషన్ కి వెళ్లి అక్కడి నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ఇంటికి తిరిగి వచ్చి.. డిన్నర్ చేసి స్కూల్, ట్యూషన్ హోంవర్క్ పూర్తి చేసి.. రాత్రి 10 నుంచి 11 గంటలకు పడుకుని మళ్లీ ఉదయం లేచి.. పరిగెత్తడం." రోజూ మీ పిల్లలు ఇంట్లో ఇదే చేస్తున్నారా?
అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు…
గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ప్రజల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి.
ఉత్తరాఖండ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. టెంపో అదుపుతప్పి లోయలో పడి 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
కర్నాటకలోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటనను ప్రభుత్వం దీనిని "తీవ్రమైన సంఘటన" అని పేర్కొంది. ఆదివారం ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు
ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు.. జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా ఉండేందుకు ఒకరికొరు ప్రమాణం చేసుకున్నారు.. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.. అంతే కాదు.. తన ప్రేయసి కోసం.. ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.