Festivel Rush: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం లోపు వారి స్వగ్రామాలకు వెళ్లి వారి వారి కుటుంబాలతో గడిపేందుకు బయలు దేరారు. సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) వంటి ప్రధాన బస్ స్టేషన్‌లు రిజర్వ్ చేసిన టిక్కెట్‌లతో చేరుకునే వారి సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్‌లు అన్ని ప్రయాణికులతో సందడిగా మారాయి.
Read also: Jagtial News: సార్ కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల యువకుడి ఆవేదన..
స్టేషన్లలో కాలు పట్టేంత స్థలం కూడా లేకుండా జనంతో కిటకిట లాడుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లోని ఎక్కడ చూసిన బట్టలు, బహుమతులతో నిండిన భారీ సామానుతో దసరా పండుగకు తీసుకున్న వస్తువుల దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మొత్తం పండుగ సీజన్ కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్ర రవాణా సంస్థ హైదరాబాద్‌లో అనేక చోట్లు పికప్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అక్టోబరు 1 నుండి 15 వరకు MGBS, JBS, LB నగర్, ఉప్పల్, అరమ్‌ఘర్, సంతోష్ నగర్, KPHB నుండి వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సులను ఎక్కవచ్చని ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలను సులభతరం చేస్తాయని పేర్కొంది. మరోవైపు బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నందున.. భద్రతా సిబ్బంది తనిఖీలు, నిర్వహిస్తూ.. ప్రయాణికుల వస్తువులపై భద్రతకు భరోసా ఇస్తున్నారు.
Mayor Murder: 6 రోజుల క్రితమే మేయర్‌గా బాధ్యతలు.. ఆపై దారుణ హత్యకు గురి