CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి.. గాయపడ్డవారికి రూ.50 లక్షలు..
- అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు..
- ఇప్పటి వరకు 17 మంది మృతి..
- మెడికవర్ ఆస్పత్రిలో భాదితులకు.. కేజీహెచ్ లో మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శ..
- మృతిచెందినవారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున..
- తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హమీ ఇచ్చారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున.. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు..
మరోవైపు.. విశాఖ కేజీహెచ్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించారు సీఎం చంద్రబాబు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ సభ్యులు చాలా భాదలో ఉన్నారు. కానీ, చనిపోయిన వారిని తీసుకురాలేం. అయితే, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తాం అన్నారు.. తీవ్రంగా గాయపడిన వారికి యాబై లక్షల రూపాయలు అందిస్తాం అన్నారు.. ఆ కుటుంబాలను ఏవిధంగా ఆదుకోవాలో.. ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆధుకుంటాం అన్నారు.. జరిగిన సంఘటన చాలా భాదాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
కాగా, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతచెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.. అందులో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. 26 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, వారికి ఎంత ఖర్చు అయినా ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం అని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున.. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50 లక్షల చొప్పున.. స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!