Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
ఇది కూడా చదవండి: Yuva Galam Padayatra Book: గత ప్రభుత్వ అరాచక పాలనపై పుస్తకం.. సీఎంకు అందజేసిన నారా లోకేష్
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
అదృశ్యమైన వ్యక్తులు పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్‌పూర్)గా గుర్తించారు. హోషియార్‌పూర్ ఏజెంట్ సాయంతో మే 1న ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 11 నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుటుంబ సభ్యులతో ఎంబసీ పంచుకుంటోంది. ఇన్ని రోజులైనా తమ పిల్లల జాడ ఇంకా తెలియకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ ఏజెంట్ దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని ముగ్గురికి హామీ ఇచ్చి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి ఇరాన్‌లో బస కల్పిస్తున్నట్లు ఏజెంట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మే 1న ఇరాన్‌లో అడుగుపెట్టగానే ముగ్గురు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఇక అప్పటినుంచి ఏజెంట్ జాడ కూడా పత్తాలేకుండాపోయింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఏజెంట్ ఆచూకీ తెలిస్తే.. తమ బిడ్డలు ఎక్కడున్నారన్నది తెలుస్తుందని చెబుతున్నారు. కిడ్నాపర్లు రూ.కోటి ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురి జాడ కోసం ఇరాన్ అధికారులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!